టూరిజం.. ఈ పేరు విని కూడా చాలా రోజులయ్యింది. మహమ్మారి కారణంగా కొత్త ప్రదేశాలకి వెళ్ళాలి, కొత్త వారిని కలుసుకోవాలి అనే మాటనే మర్చిపోయారు. గత ఏడాది మొదటి సగభాగం పూర్తిగా ఇళ్ళలోనే ఉండిపోయాం. రెండవ భాగంలో అనేక నియమ నిబంధనలు, జాగ్రత్తల మధ్య బయటకి వెళ్ళడం మొదలెట్టారు. ఇలా బయటకి వెళ్ళి, కొత్త ప్రదేశంలో ఉన్న తాజాదనాన్ని తమలోకి తెచ్చుకోవడానికి ఎక్కువ మంది వెళ్తున్న పర్యాటక ప్రదేశం ఏదైనా ఉందంటే, అది కేరళ మాత్రమే.
కేరళ సందర్శనకి వెళ్తున్నప్పుడు ఇక్కడ పొందుపర్చిన పాయింట్లు మైండులో పెట్టుకోండి. ఎందుకంటే, మహమ్మారి కారణంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రతీ రాష్ట్రానికి వేరుగా ఉంటాయి. మీ ప్రదేశంలో చాలా సాధారణం అనుకున్నది మీరు వెళ్ళిన ప్రదేశంలో సాధారణం కాకపోవచ్చు.
కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, వారం రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు సందర్శనానికి కేరళ వేళ్తే క్వారంటైన్ అవసరం లేదు.
దేశీయ సందర్శకులు ఖచ్చితంగా కోవిడ్ జాగ్రత్త పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి.
వారం రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, ఏడవ రోజు ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. అది కూడా సందర్శకుల డబ్బులతోనే. టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు క్వారంటైన్ లో ఉండాల్సిందే.
వారం కన్నా ఎక్కువ ఉండాలని ముందే అనుకుంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా 48గంటల క్రితందై ఉండాలి. టెస్ట్ చేసుకోకపోతే కేరళలో అడుగు పెట్టగానే ర్యాపిడ్ టెస్ట్ అయినా చేయించుకోవాలి. ఒకవేళ ఎలాంటి టెస్ట్ చేసుకోకపోతే, వారం రోజులు క్వారంటైన్ లో ఉండాలి.
మాస్క్ ఖచ్చితంగా వాడాల్సిందే. సానిటైజ్ర్ బ్యాగులో ఉంచుకోవాలి.