ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనేక కారణాల రిత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డ వారు చాలామంది ఉంటారు. అయితే ఏదైనా పండగ వస్తే సొంతూర్లకి వెళ్లి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగను ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి దసరా. ఈ క్రమంలోనే అందరూ సొంతూర్లకు ప్రయానమవుతారు. దీంతో రైళ్లు బస్సులు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇప్పుడు దసరా పండుగ దృశ్య ప్రయాణీకుల రద్దీ పెరగటంతో ధరలను భారీగా పెంచాయి. మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి 350 రూపాయల నుండి 1000 రూపాయల వరకు బస్ టికెట్ ధర ఉంటుంది.
ఇక పండగ సీజన్‌లో అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి 1000 రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకు నిర్ణయిస్తారు. కానీ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ అయితే ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి టికెట్ ధర 7000 వేల రూపాయలు నిర్ణయించాడు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా రేట్లు పెంచిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రేట్లు భారీగా పెంచినప్పటికీ దసరా పండక్కి ఇంటికి వెళ్లకుండా ఉండలేరు కదా..!