ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లాలంటే.. ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లాలన్నా.. భార్యాభర్తలు కలిసి వెళ్లాలన్నా.. ఇండియాలో అయితే ఉత్తర్ భారత్‌లో దిల్లీ, జైపూర్ దక్షిణ భారత్‌లో అయితే కేరళ, కన్యాకుమారి ఇలాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. లేదా కాస్త ఉన్నోళ్లయితే విదేశాలకు వెళ్తారు. కానీ ఇండియాలోనే మీకు తెలియని చాలా అందమైన ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లాంటి మంచు ప్రాంతాలను తలపించే సోయగాలు మన భారతంలోనే చాలా ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా..? మీ నెక్స్ట్ వెకేషన్ వీటిలో ఏదైనా అవ్వొచ్చు.. అందుకే ఓ సారి లుక్కేయండి..!
కూర్గ్ : కర్ణాటక కశ్మీర్‌గా పిలుచుకనే ప్రాంతం కూర్గ్. ఇది హనీమూన్ కపుల్స్‌కు భూతల స్వర్గం. చాలా కొత్త జంటల మొదటి ప్రేమ పుట్టింది ఇక్కడే. పచ్చని వాతావరణంతో కాఫీ తోటల పరిమళంతో ఈ ప్రాంతం సందర్శకులను కట్టిపడేస్తుంది. అందుకే ఒకసారి వెళ్లిన వాళ్లు మళ్లీమళ్లీ వెళ్లాలనుకుంటారు. ఇక్కడి జలపాతాలు చెర్రీ ఆన్ ది కేక్ అన్నమాట. చెట్లపైన ఉండే హోటల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మాటల్లో వర్ణించలేం. తక్కువ బడ్జెట్లో స్వర్గవిహారం చేయాలనుకుంటే కూర్గ్ బెస్ట్ ప్లేస్.
అండమాన్ దీవి : పైన నీలిరంగు ఆకాశం.. అది కిందపడిందా అన్నట్లు అదే నీలిరంగులో నీటిని పరుచుకుని ఉన్న దీవి. నేను చెప్పేది అండమాన్ దీవి గురించేనండి. పచ్చని చెట్ల మధ్యలో నీలి రంగు భూతల స్వర్గం ఈ దీవి. ప్యారెట్ ఐల్యాండ్ పక్షులు, ఆక్వా ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. పర్యాటకుల మనసు దోచే ఈ అండమాన్ దీవికి ప్రతి ఒక్కరు తమ లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.
పుష్కర్ : పుష్కర్ అంటే నీలి తామర పువ్వు అని అర్థం. ఎన్నో చారిత్రక ప్రదేశాలకు కొలువైన ఈ రాష్ట్రంలో ది బెస్ట్ ప్లేస్ అంటే పుష్కర్. ఇక్కడి పెంపుడు జంతువుల సంత చాలా స్పెషల్. ఇక్కడికి టూర్‌కి వచ్చిన వాళ్లు తప్పకుండా ఏదో ఒక పెట్ని తమ వెంట తీసుకెళ్తారు. పుష్కర్‌లో ఒంటె సవారీ సూపర్‌గా ఉంటుంది. ఈసారి టూర్ ప్లాన్ చేస్తే అందులో పుష్కర్ తప్పకుండా ఉండేలా చూసుకోండి.
చంద్రతాల్ : సరస్సులంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ అందమైన సరస్సు ఉంది. దాని పేరు చంద్రతాల్. చంద్రుడి ఆకారంలో ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఇక్కడికి వెళ్లొచ్చు. లోతైన నీలిరుంగు సరస్సు.. మంచుతో కప్పిన పర్వతాలు.. పచ్చని చెట్లు.. వావ్.. చెబుతోంటేనే దిమ్మదిరిగిపోతోంది కదా ఇక వెళ్తే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడికి వెళ్తే మీ లైఫ్‌లో ఓ మంచి మెమొరీ క్రియేట్ అవుతుంది.
సోలాంగ్ వ్యాలీ : స్విట్జర్లాండ్‌కి వెళ్లాలనిపిస్తోందా.. కానీ మీ బడ్జెట్ సహకరించట్లేదా అయితే మీ కోసమే మన ఇండియాలోనూ ఓ స్విట్జర్లాండ్ ఉంది. అదే సోలాంగ్ వ్యాలీ. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ వ్యాలీని చూస్తే స్విట్జర్లాండ్‌లో ఉన్న ఫీల్ కలుగుతుంది. మంచుతో కప్పిన పర్వతాలు.. దట్టమైన అడవులు.. నీలి రంగులో ఆకాశం ఎంత అందంగా ఉంటుందో. మీ ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్తే ఆ లిస్టులో ఈ ప్లేస్ తప్పక ఉండాల్సిందే.