వండర్‌లా సూపర్‌ ఆఫర్‌..కేవలం విద్యార్థులకు మాత్రమే.. త్వరపడండి..

-

మనదేశంలో వినోదాన్ని పంచె పార్కులలో వండర్ లా కూడా ఒకటి..వేసవి కాలంలో వండర్ లా కు ఎక్కువ మంది వస్తారు.. వాటర్ గేమ్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువగా సందర్శిస్తారు.. ఎంత వినోదాన్ని పంచుతుందో అంతే ఎక్కువగా ధర కూడా ఉంటుందని చెప్పాలి.. అయితే ఇప్పుడు విద్యార్థుల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది..హాల్‌ టికెట్ ఆఫర్‌ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరంలో10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఈ డిస్కౌంట్‌ను వండర్‌లా బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి పార్క్‌ల వద్ద అందిస్తుంది. వండర్‌లా వద్ద ఎంట్రీ టికెట్ తీసుకునే సమయంలో విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్‌ టికెట్స్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే 35 శాతం డిస్కౌంట్‌ అందిస్తారు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు పొందొచ్చు. పార్క్‌ లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు విద్యార్థులు తమ హాల్‌ టికెట్స్‌ను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను మార్చి 20వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అందుబాటులో ఉంచారు..

 

వండర్ లా ఎంట్రీలో స్టూడెంట్స్ తమ హాల్ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ టికెట్స్‌కి వర్తించదు. ఈ ఆఫర్‌కింద బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సెల్‌ చేయడానికి అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ టికెట్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం వండర్‌లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెబుతున్నారు.. ఇప్పుడెలాగో ఎగ్జామ్స్ అయ్యాయి.. కాబట్టి హాల్ టిక్కెట్ ను ఇలా కూడా వాడి ఎంజాయ్ చెయ్యండి.. త్వరపడండి..

 

Read more RELATED
Recommended to you

Latest news