హైడ్రోజన్ తో నడిచే రైలు ఇది.. ప్రపంచంలోనే మొదటిది..!

-

షాక్ అయ్యారా? హైడ్రోజన్ తో రైలు నడవడమేందని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివిన టైటిల్ కరెక్టే. మీరు పైన చూస్తున్న ఫోటోలోని ట్రెయిన్ హైడ్రోజన్ తోనే నడుస్తుంది. ఇండియాలోనా ఎక్కడ నడిచేది అని తొందర పడకండి. దాన్ని ప్రారంభించింది జర్మనీలో. అవును.. సోమవారమే (సెప్టెంబర్ 17న) దాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే హైడ్రోజన్ తో నడిచే మొట్టమొదటి రైలు ఇది.

ప్రస్తుతం ఎక్కువగా డీజిల్, కరెంట్ తో నడిచే ఇంజన్లే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు కదా. అయితే.. డీజిల్ తో నడిచే ట్రెయిన్ల నుంచి వచ్చే పొగ చాలా డేంజర్. పర్యావరణానికి అది చాలా హాని చేస్తుంది. దీంతో ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీతో రూపొందించారు ఈ హైడ్రోజన్ ఇంజన్లను. వాటికి ఉండే ఫుయెల్ సెల్స్ హైడ్రోజన్, ఆక్సిజన్ కాంబినేషన్ లో కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయి. అవి ఉత్పత్తి చేసే కరెంట్ ద్వారా ఆ ట్రెయిన్ నడుస్తుందన్న మాట. బాగుంది కదా. ఇక.. వాటి కాంబినేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి కాగా.. కేవలం నీళ్లు, ఆవిరి మాత్రమే బయటికి పోతుంది. అవి పర్యావరణానికి ఎటువంటి హానీ తలపెట్టవు. అందుకే ఈ పర్యావరణహిత ట్రెయిన్లను జర్మనీ ప్రారంభించింది. బాగుంది కదా. మన దేశంలో కూడా డీజిల్ ట్రెయిన్స్ పోయి.. ఈ హైడ్రోజన్ ట్రెయిన్స్ ను రైల్వే శాఖ ప్రవేశపెడుతుందేమో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news