వైభవంగా జరిగిన హీరో నిఖిల్ పెళ్ళి .. పెళ్ళి ఫోటోలు ..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈరోజు ఉద‌యం 6 గంటల 31 నిమిషాలకు డాక్టర్ పల్లవి వర్మను సంప్రదాయబద్ధంగా వివాహమాడాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత సన్నిహితులు, బంధు మిత్రులు మాత్రమే నిఖిల్ పెళ్ళికి హాజరయ్యారు హాజరయ్యారు.

 

ఫిబ్రవరి1న గోవాలో పల్లవి వర్మతో నిశ్చితార్థం జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఖిల్ పల్లవి వర్మ ల వివాహాన్ని ఏప్రిల్ 16వ తేదీన జరపాలని ఇరు కుంటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే కారోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్న నేపథ్యంలో… ముందు అనుకున్న తేదీని మార్చి మే 14వ తేదీని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే నిళిల్ పల్లవి వర్మ ల వివాహం చక్కగా జరిగింది.

 

మరికొన్నాళ్ళు ఆగాలనుకున్న ఇరు కుటుంబాలు త్వరలో మూఢం రాబోతున్న కారణంగా మళ్ళీ మంచి రోకుల కోసం ఆగాల్సి వస్తుమని ఈ కారణంగానే పెళ్ళి ని వాయిదా వేయకుండా ఇద్దరి జాతకాల రిత్యా అన్ని రకాలుగా ఈ నెల 14 న దివ్యమైన ముహూర్తం ఉండటంతో పెళ్ళి జరిపించాలని నిర్నయించారత. ఈ రోజు ఉదయం 35 మమదు బంధు మిత్రుల ఈ వివాహం ఘనంగా జరిపించారు. పెళ్ళి కి హాజరు కాలేకపోవడంతో ఈ కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌స్తుతం నిఖిల్ పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news