కరోనా కలకలం.. పాతబస్తీ బంద్..!

-

లాక్‌ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జనం రద్దీ బాగా పెరిగింది. దీంతో న‌గ‌రంలో కరోనా మ‌హ‌మ్మారి అంతకంతకూ పెరుగుతుండటం అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో వ్యాపారులే స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. దీంతో చార్మినార్ లోని దుకాణాలన్నీ 15 రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు వ్యాపారులు. ఈరోజు లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

 

చార్మినార్ చుట్టుపక్కల షాపులన్నీ 15 రోజుల వరకు స్వచ్చందంగా మూసివేయడానికి యజమానులు అంగీకారం తెలిపారు. దీంతో చార్మినార్ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేసే పరిస్థితి రావొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ లోని బనారస్‌ పట్టు చీరల మార్కెట్‌ ను బంద్‌ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news