ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కంటెయిన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి అన్లాక్ 2.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. మరోవైపు మంగళవారం ఉదయం భారత్-చైనా కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో మోదీ ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం ఇవాళే 59 చైనా యాప్లను బ్యాన్ చేసింది. దీంతో ప్రధాని ఏం చెబుతారనే విషయంపై అందరి దృష్టీ నెలకొంది.
Prime Minister @narendramodi will address the nation at 4 PM tomorrow.
— PMO India (@PMOIndia) June 29, 2020