పాకిస్థాన్​ ఆరోగ్యశాఖ మంత్రి జాఫర్​ మిర్జాకు కరోనా …!

-

ప్రపంచంలో రోజురోజుకి కరోనా వైరస్ ఎలా  చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, ధనిక, పేద అని తేడా లేకుండా ఈ కరోనా మహమ్మారి సోకడంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇకపోతే దాయాది దేశమైన పాకిస్థాన్ లో కూడా కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. పాకిస్తాన్ లో రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మీర్జాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

pak minister
pak minister

పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి కి వైరస్ సోకిన నాలుగు రోజులకే మళ్లీ పాక్ దేశ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అక్కడి ప్రజా ప్రతినిధులు భయపడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలువురు చట్ట సభ్యులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఈ భయం మరింతగా ఎక్కువవుతోంది. అంతేకాదు వారిలో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పాకిస్థాన్ లోని  ప్రజాప్రతినిధులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే దేశంలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ లో 2,31,818 కేసులు నమోదవగా అందులో 4700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news