డేరాబాబా 2.o : తెలంగాణలో దారుణం..!

-

స్వామీజీల పేరుతో అమాయకుల్ని మోసం చేయడం. దొరికినంత డబ్బు దోచుకోవడం. మహిళలను శారీరకంగా వాడుకోవడం. ఇలాంటి ఘటనలు తరచూ దేశ నలుమూలల ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకుంది. ఓ దొంగ బాబా ఆయన శిష్యుడితో కలిసి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆయన లీలలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

ధర్మాజీ పేటకు చెందిన రఘు అనే వ్యక్తి ఇంటర్‌ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇక చదువుకుంటే లాభం లేదని.. బాబా అవతారం ఎత్తాడు. అయితే రఘుని బాబా అని నమ్మిన ఓ మహిళ ఇతడి వద్దకు వచ్చింది. సదరు మహిళ ఓ అమ్మవారి గుడికట్టాలని సంకల్పించింది. ఇదే విషయాన్ని బాబాకి చెప్పింది. భక్తురాలి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న దొంగ బాబా ఆమెపై కన్నేశాడు. ఆయన శిష్యుడు నరేష్‌తో కలిసి సదరు మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. దీంతో వీరిపై బాధితురాలు దుబ్బాక పోలీసులను ఫిర్యాదు చేసింది. కాగా, దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రతుటామ వీరు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు వారికోసం గాలించడం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news