వివాదాస్పద దర్శకుడు వర్మ తీసిన “పవర్ స్టార్” సినిమాపై ప్రకాష్ రాజ్ స్పందించాడు. బావ ప్రకటన స్వేచ్ఛ ఎవ్వరికైనా ఉంటుంది.. హద్దు దాటనంతవరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వర్మ హద్దు దాటడనే అనుకుంటున్నానని అన్నాడు. అయినా వర్మకు ఏదైనా చెప్పే హక్కు ఉంది, ఆయన సినిమాను ఆయన్ని తీసుకోనివ్వండంటూ హితవు పలికాడు.
వర్మ తన దృష్టిలో ఒక అద్భుతమైన వ్యక్తి అని, పవర్ స్టార్ సినిమా క్లైమాక్స్‌లో పవన్ గురించి చాలా పాజిటివ్‌గా చూపించారని చెబితే విన్నానని చెప్పాడు. అయినా వర్మ తప్పు తీస్తున్నాడనుకోండి చూడటం మానేయండి, అంతేకానీ కానీ దాడులకు దిగడం సరికాదని అన్నాడు. వర్మకు ఉన్న తెలివి, ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరా చూడలేదు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు పవన్ ఫ్యాన్స్ కూడా వర్మపై ఏదో సినిమా తీసారని తెలిసింది, కొట్టుకోవటం కన్నా ఇది బెటర్ కదా అన్నాడు ప్రకాష్ రాజ్.
పవర్ స్టార్ సినిమాకు వ్యతిరేకంగా టాలీవుడ్ నటులు చాలామంది తమ వాయిస్ వినిపించారు. పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కొందరు ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి కూడా చేశారంటూ వార్తలు కూడా చూశాం. ఇక ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వర్మను సపోర్ట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.