తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి లేనప్పుడు స్థానిక ఎన్నికలకు భయపడిన బాబు, ఇప్పుడు వైరస్ వ్యాప్తి ఉన్న వేళ ఎన్నికలంటూ చాలెంజ్ విసురుతున్నాడని విమర్శించారు. అలాగే ‘సవాల్ సిల్లీగా వున్నా.. ప్రజల భద్రతపై నారావారి నిబద్దత ఏంటో అర్ధమైపోయింది. తన స్వార్ధం కోసం దేనికైనా తెగించే డెడ్లీ పొలిటికల్ వైరస్ నారానిప్పు.’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు పలికిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే మాట తప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరస్ వ్యాప్తి లేనప్పుడు స్థానిక ఎన్నికలకు భయపడిన బాబు..ఇప్పుడు వైరస్ వ్యాప్తి వున్న సమయంలో మళ్ళీ ఎన్నికలని ఛాలెంజ్ విసురుతున్నాడు. సవాల్ సిల్లీగా వున్నా.. ప్రజల భద్రతపై నారావారి నిబద్దత ఏంటో అర్ధమైపోయింది. తన స్వార్ధం కోసం దేనికైనా తెగించే డెడ్లీ పొలిటికల్ వైరస్ నారానిప్పు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 4, 2020
ఈ నేపధ్యంలోనే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల్లో మద్దుతు ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనీ.. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ గనుక గెలిస్తే, తాము అమరావతి అంశంపై మాట్లాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకుగాను 48 గంటల సమయం ఇస్తున్నానని.. గడువు ముగిసేలోపు సీఎం జగన్ దీనిపై స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.