టిక్‌టాక్‌కు అన్ని దారులూ మూసుకుపోయిన‌ట్లే.. కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ నిరాసక్త‌త‌..?

-

చైనా సాఫ్ట్‌వేర్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌కు అమెరికాలోనూ అన్ని దారులూ మూసుకుపోయిన‌ట్లేనా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆస‌క్తి చూపించినా.. ప్ర‌స్తుతం అందుకు ఆ సంస్థ నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని తెలిసింది. టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్ దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ఓ ఫిగ‌ర్ చెప్పింద‌ట‌. కానీ ఆ మొత్తం టిక్‌టాక్‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్ కొనుగోలుపై అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది.

tiktok and microsoft deal may not happen why

ఇక మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్.. టిక్‌టాక్‌ను కొనేందుకు ఆస‌క్తిగా ఉన్నా.. కేవ‌లం 45 రోజుల్లో ఆ డీల్‌ను పూర్తి చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తోంది. టిక్‌టాక్‌ను కొనేందుకు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కేవ‌లం 45 రోజుల గ‌డువు మాత్ర‌మే ఇచ్చారు. త‌రువాత టిక్‌టాక్ బ్యాన్ అవుతుంద‌ని చెప్పారు. అందుకు ఆయ‌న ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం కూడా చేశారు. అయితే మ‌రీ 45 రోజుల గ‌డువు అంటే.. చాలా త‌క్కువ స‌మ‌య‌మ‌ని, అంత త‌క్కువ వ్య‌వ‌ధిలో టిక్‌టాక్ లాంటి భారీ సంస్థ‌ను కొనాలంటే స‌మ‌యం చాల‌ద‌ని ట్విట్ట‌ర్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ట్విట్ట‌ర్ ఈ విష‌య‌మై ట్రంప్ ప్ర‌భుత్వంపై లా సూట్ వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు త‌మ‌కు మ‌రింత ఎక్కువ గ‌డువు కావాల‌ని ట్విట్ట‌ర్ ట్రంప్ ప్ర‌భుత్వంపై లా సూట్ వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే 45 రోజుల త‌రువాత త‌మ యాప్ అమెరికాలో బ్యాన్ అయితే గ‌న‌క అటు టిక్‌టాక్ కూడా అమెరికా ప్ర‌భుత్వంపై చ‌ట్ట‌ప‌రంగా ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తున్న‌ద‌ట‌. ఈ క్ర‌మంలో 45 రోజుల త‌రువాత ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news