కరోనా నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోలుకున్నారు. తాజాగా చేసిన కోవిడ్ 19 పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని స్వయంగా ఆయనే వెల్లడించారు. అలాగే తనకు వైద్యసేవలు అందించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు రేపటి వరకూ ఐసోలేషన్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
मेरी #COVID19 की रिपोर्ट निगेटिव आई है।
डॉक्टर्स की सलाह पर मैं कल तक आइसोलेशन में रहूंगा।
मैं डॉक्टर्स नर्सेज़ और पूरी टीम को हृदय से धन्यवाद देता हूँ।
आप सभी शुभचिंतकों ने मेरे स्वास्थ्य लाभ हेतु प्रार्थना की, इसके लिए मैं आपका सदैव आभारी रहूंगा।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 11, 2020
కాగా, జులై 25న ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం భూపాల్ లోని చిరాయు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇకపోతే కరోనా నుండి కోలుకున్న తరవాత ప్లాస్మా దానం చేస్తానని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను సేకరించి కరోనా బారిన పడిన వారికి అందించడం ద్వారా వారు త్వరగా కొలుకుంటారని ఆయన తెలిపారు.