కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఉదయం 10 గంటలకు ‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా నటిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నగేష్ కుకునూర్ డైరెక్టర్ చేస్తోన్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్న ఈ మూవీని వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
What better day than the INDEPENDENCE DAY for this! Teaser of #GoodLuckSakhi will be out on August 15 at 10 AM! #GoodLuckSakhiTeaser
Subscribe & stay tuned ▶️ https://t.co/JRHToj2WHU@KeerthyOfficial @AadhiOfficial @IamJagguBhai @nkukunoor @ThisIsDSP @shravyavarma @sudheerbza pic.twitter.com/bbwLDG8q6k
— Worth A Shot (@WorthAShotArts) August 13, 2020