ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కళాశాలలు పాఠశాలను ప్రారంభించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ గడువు ముగుస్తుంది.అయితే ఎంతోమంది విద్యార్థులు కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందలేకపోయారు.
దీనిపై పునరాలోచించిన తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువును వచ్చే నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా వివిధ రకాల కారణాలతో ఇంటర్ అడ్మిషన్ చేసుకోని విద్యార్థులందరికీ ఇటీవలే తెలంగాణ విద్యాశాఖ అందించిన అవకాశం ఒక మంచి శుభవార్త అని చెప్పాలి.