హైదరాబాద్ లోని బోరబండలో మళ్లీ భూమి కంపించింది. దీన్తి స్థానికులు భయంతో పరుగులు తీశారు. రెండు రోజుల క్రితం శబ్దాల కంటే భారీ శబ్దాలు వచ్చాయని అంటున్నారు స్థానికులు. భారీ శబ్దాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ శబ్దాలు జనాలను భయబ్రాంతులకు గురి చేశాయన్న సంగతి తెలిసిందే. బోరబండ, రెహమత్ నగర్, అల్లాపూర్ ప్రాంతాల్లో వింత వింత శబ్దాలు రావడంతో జనం వణికి పోయారు.
భూకంపం వచ్చిందేమో అనుకుని బయటకు పరుగులు తీశారు. భయంతో రాత్రి అందరూ ఇంటి బయటనే ఉండి పోయారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని అంటున్నారు. అప్పుడు కూడా భూకంపం కాదని పోలీసులు ముందు ప్రకటించినా ఆరోజుఅన భూకంపం వచ్చినట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు, 1.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు గుర్తించామని రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రకంపనల వచ్చాయని శాస్త్రవేత్తలు, పేర్కొన్నారు.