ఐపీఎల్ 2020లో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌కు తెర లేచింది.ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న అజింక్య రహానె.. చెన్నై జట్టుకు ఆడితే చూడాలనుందా..? ఫ్రాంఛైజీలు అనుకుంటే ఇది సాధ్యమే. ఐపీఎల్ మిడ్‌సీజన్ ట్రాన్‌ఫర్‌లో భాగంగా ఒక జట్టులోని ఆటగాడిని మరొక టీమ్‌కు బదిలీ చేసేయొచ్చు. అన్ని ఫ్రాంఛైజీలు సగం మ్యాచ్‌లు ఆడేశాయ్. దీంతో ఆటగాళ్ల బదిలీకి తెరలేచింది. సీజన్ మధ్యలో ఆటగాళ్లను ట్రాన్స్‌ఫర్ చేయడానికి అయిదు రోజుల గడువు ఉంది.
ఐపీఎల్ 2020లో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌కు టైం వచ్చింది. ఒక్కో జట్టు సగం మ్యాచ్‌లు ఆడేశాయ్. ఇవాళ్టి నుంచి ఆటగాళ్ల బదిలీకి విండో ఓపెన్ కానుంది.ఇప్పటి వరకు ఆడని స్టార్ ఆటగాళ్లు వేరే జట్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో గేల్, ఇమ్రాన్ తాహీర్, మిల్లర్ లాంటి టాప్ ఆటగాళ్లు ఉన్నారు. ఏదైనా ఫ్రాంఛైజీ ఉపయోగించుకోని ఆటగాళ్లను.. తమకు అవసరనుకుంటే మరో ఫ్రాంచైజీ ఈ సీజన్ వరకు అరువు కింద తెచ్చుకోవచ్చు. గత సీజన్‌లోనే ఈ పద్ధతి ప్రారంభమైంది. గత సీజన్‌లో దేశవాళీ ఆటగాళ్లకే పరిమితమైన ఈ ప్రక్రియలో ఇంటర్నేషన్ క్రికెటర్లు కూడా చేరారు.
ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు అరువు తీసుకున్న ఫ్రాంచైజీకి ఆటగాడు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్ ముగిసే వరకే ఈ ఒప్పందం. వచ్చే ఏడాది ఆటగాడు యథాతథంగా సొంత జట్టులోనే కొనసాగుతాడు. ట్రాన్స్‌ఫర్ అయిన ఆటగాడు సొంత జట్టుపై మ్యాచ్ ఆడేందుకు వీలులేదు. అయితే జట్లు అరువు కింద ఆటగాళ్లను ఇచ్చేందుకు సిద్ధపడతాయా అన్నది కూడా సందేహమే. గాయాల కారణంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అదీగాక.. తమ జట్టులోని నాణ్యమైన ఆటగాళ్లను ఇతర జట్లకు ఇచ్చి సమస్యలు కొనితెచ్చుకోవాలని ఏ జట్టు కోరుకుంటుంది.