టాలీవుడ్ ప్రెస్టేజియస్ ఫిలింస్ కి విలన్ల కొరత…!

-

టాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిలింస్ లో విలన్ వేషానికి డిమాండ్.. అంతకంతకు పెరిగిపోతుంది.యునీక్ లుక్ ఆర్టిస్ట్ కోసం దర్శకులంతా తెగ వెతుకున్నారు.తెలుగు పరిశ్రమ విలన్స్ ఎవ్వరూ వీళ్లకు సరిగా ఆనకపోవడంతో పక్క పరిశ్రమలపై పడ్డారు.మరి మనవాళ్లు పడుతోన్న కష్టానికైనా … కావల్సిన ఫీచర్స్ తో భయపెట్టే విలన్ కోసం వేట కొనసాగిస్తున్నారు…

టాలీవుడ్ సీనియర్ హీరోలకే కాదు …యంగ్ లీడింగ్ హీరోల సినిమాలకు… విలన్లు దొరకడం పెద్ద కష్టంగా మారిపోయింది.సినిమాలు స్టార్ట్ అయ్యి సెట్స్ మీదన్నప్పటికీ విలన్ విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నారు.చేసిన వారికి మళ్లీ మళ్లీ విలన్ వేషాలు ఇవ్వడం దర్శకులకు అస్సలు నచ్చడం లేదు.ఫ్రెష్ లుక్ విలన్ అయితేనే స్టోరి వెయిట్ కు సింక్ అవుతాడనే అభిప్రాయంలో ఉంటున్నారు.

కొరటాల ఆచార్యకు ఇప్పటివరకు విలన్ దొరికితే ఒట్టు.తెలుగు తెరపై విలన్ గా రాణిస్తున్నవారెవరికీ ఆచార్యలో విలన్ వేషం ఇచ్చే పరిస్థితుల్లో కొరటాల కనిపించడం లేదు.చిరంజీవి సినిమా కావడంతో నో కాంప్రమైజ్ పాలసీని ఫాలో అవుతూ బిటౌన్ నుంచి విలన్ ను తెచ్చుకునే పనిలో కొరటాల బిజీ అయిపోయాడు. ఇక బోయపాటి, బాలయ్య సినిమాకు విలన్ దొరకడం లేదు.బోయపాటి సినిమాలో విలన్ పాత్రదారి ఎంతో రౌద్రంతో ఉంటాడు.మాసివ్ లుక్ లో కనిపిస్తాడు.మరి ఆ తరహా పాత్ర వేయాలంటే బిటౌన్ ఆర్టిస్ట్ పనిచేయడు.అయితే కన్నడం లేదంటే తమిళ విలన్ ను తెచ్చుకోవల్సి ఉంటుంది.

ఇక యంగ్ లీడింగ్ హీరోల ప్రాజెక్ట్స్ లో బన్నీ పిక్చర్ పుష్ప కనిపిస్తుంది.ముందుగా ఈసినిమాకు విలన్ గా బాబీ సింహను అనుకున్నారు.చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది.వరుడులో బన్నీకి విలనిజంలోని మజాను రుచి చూపించిన ఆర్యను అనుకున్నారు.అదీ కుదర్లేదు.అలవైకుంఠపురములో భాగా వర్కవుటైన సముద్రఖనినైనా కన్పామ్ చేస్తారనుకుంటే …చివరకు సుకుమార్ దీనికి నో చెప్పడంతో… మరి లారీ డ్రైవర్ పుష్పరాజ్ ను ఢీకొట్టే పాత్రను చేసే ఆ “విలన్ ఎవరనే ప్రశ్న” గతకొంతకాలంగా సోషల్ మీడియాలో గట్టిగానే ట్యాగ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news