దుబ్బాకలో హరీష్ రావుకు షాక్‌ ఇచ్చిన ఆ గ్రామ ప్రజలు..!

-

దుబ్బాక ఎన్నిల్లో బీజేపీ దూసుకుపోతోంది.ఇప్పటి వరకు పూర్తైన ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు..తొలి రౌండ్‌ నుంచి బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తూనే..ఆరు, ఏడు,10వ రౌండ్‌లో బీజేపీ కాస్త వెనుకబడినట్లు కన్సించిన..తర్వాత రౌండ్‌లో తిరిగి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది..టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టించింది..ముఖ్యంగా మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో సైతం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. హరీష్ రావు దత్తత గ్రామమైన చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చారు.కాగా, ఇప్పటి జరిగిన 10 రౌండ్ల కౌంటింగ్‌లో మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ బీజేపీ మెజార్టీ సాధిస్తూ వచ్చింది.. దుబ్బాకలో పదవ రౌండ్ ముగిసే సమయానికి 74,040 ఓట్ల లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 34,748 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 30,815 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 8,582ఓట్లు పోల్ అయ్యాయి..11వ రౌండ్లో కూడా బీజేజీ అధిక్యంలోకి వచ్చారు.. మొత్తంగా రఘునందన్ రావు 3,933 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news