సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఏపీ కీలక నిర్ణయం..

-

అధికారంలోకి వచ్చాక ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చూపిస్తున్న జగన్ అన్ని విషయాల్లో ప్రక్షాళన తీసుకు వెళుతున్నారు. తాజాగా పేదల వైద్యానికి ఊతం ఇచ్చేలా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్షాళన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఇవ్వకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే చికిత్స ఖర్చులకి సంబంధించి ఎటువంటి రీయింబర్స్మెంట్ దరఖాస్తులను స్వీకరించవద్దని సీఎం ఆఫీస్ ప్రజాప్రతినిధులకు సూచనలు చేసింది.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2434 జబ్బులకు చికిత్స అందిస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్చార్జ్ హరికృష్ణ పేర్కొన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే 2434 జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తులను స్వీకరించద్దని అని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని సీఎం ఆఫీస్ నుంచి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని వాటికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ క్లైములు దరఖాస్తులను తీసుకోవాలని, అది కూడా ప్రజా ప్రతినిధుల పీఏలు మాత్రమే పంపాలని సీఎంఓ కోరింది. 

Read more RELATED
Recommended to you

Latest news