కేజీఎఫ్ దర్శకుడిపై కన్నడ అభిమానుల విమర్శలు.. ప్రభాస్ తో సినిమానే కారణమా?

-

కేజీఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కి స్టార్ స్టేటస్ వచ్చింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో ఒక్కసారిగా హీరోలందరూ ప్రశాంత్ నీల్ తో పనిచేసేందుకు ఉత్సాహం చూపారు. తారక్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా ప్రతీ ఒక్కరూ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఐతే ఎట్టకేలకు ప్రభాస్ తో సినిమా ఓకే అయ్యింది. కేజీఎఫ్ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలార్ అనే టైటిల్ నిర్ణయించారు.

ఐతే సలార్ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి కన్నడ ప్రజలు ప్రశాంత్ నీల్ పై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో హిట్టు కొట్టి తెలుగు హీరోతో సినిమా తీస్తున్నాడని, కేవలం డబ్బుల కోసమే ఇలా చేస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విమర్శల పర్వం కేజీఎఫ్ సినిమాకి ఇబ్బంది పెడుతుందా అన్నదే అనుమానంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news