అత్తా మామల వేధింపులు అనేవి సమాజంలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నా సరే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు కూడా విచిత్రంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. తాజాగా విశాఖ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భవతి అయిన కోడల్ని కాలితో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉదయ భాస్కర్ తన్నడం వివాదాస్పదం అయింది.
పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 2018 లో ఉదయభాస్కర్ కుమారుడు వేణుగోపాల్ తో వివాహం అయింది. భర్త, మామ ఆడపడుచు వేధిస్తుండడంతో గతంలోనే పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా… కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా సమయంలో శిరీషను పుట్టింటికి భర్త పంపాడు. ఆ తర్వాత ఆమె తిరిగి అత్తవారింటికి రాగా గొడవ పెట్టుకుని కాళ్ళతో తన్నాడు మామ.