చంద్రబాబు కంటే కేసీఆర్ 2000 రెట్లు ఎక్కువ.. కేటీఆర్ కు ఆర్జీవీ ట్వీట్..!

-

Varma congratulated ktr and kcr for their victory in telangana

ప్రతి విషయంలోనూ వేలు పెడుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన గురించి ఈ దేశమంతా తెలుసు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయభేరీ మోగించింది కదా. ఈ సందర్భంగా కేటీఆర్ కు ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిసింది. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. అందరి ట్వీట్ల కన్నా ఆర్జీవీ ట్వీట్ కాస్త ఆసక్తికరంగా ఉంది.

కేటీఆర్.. నీ తండ్రి కేసీఆర్ 2.0 కాదు. రజినీకాంత్ కన్నా 20 రెట్లు ఎక్కువ. మహేశ్ బాబు కన్నా 200 రెట్లు ఎక్కువ. చంద్రబాబు నాయుడు కన్నా 2000 రెట్లు ఎక్కువ అంటూ ట్వీట్ చేసి దానికి ఓ వీడియో జత చేశాడు. ఆ వీడియో స్పూఫ్ వీడియో. మహేశ్ బాబు ఆగడు సినిమాలోని ఓ సీన్ ను స్ఫూఫ్ చేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఉత్తమ్, చాడ వెంకట్ రెడ్డి, కోదండరాంలను చితకబాదినట్టుగా ఉన్న వీడియో అది.

దానికి కేటీఆర్ కూడా తనదైన శైలిలో రిప్లయి ఇచ్చారు. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు. మీకు తెలుసుకోవడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది రాము గారు.. అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు.

దానికి వర్మ.. నేను మూగవాడిని అయిండొచ్చు. కానీ.. నీకు, మీ నాన్నగారికి 2.0 బిలియన్ చీర్స్ అంటూ మళ్లీ ట్వీట్ చేశాడు వర్మ.

ఆ తర్వాత మళ్లీ కొన్ని ట్వీట్లు చేశాడు వర్మ. అందరు హీరోయిన్ల కన్నా మాత్రమే కేసీఆర్ అందగాడు అని అనుకునేవాడిని ఇన్నిరోజులు కానీ.. ఆయనే అందరు హీరోల కన్నా కూడా అందగాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. హిమాలయాల కన్నా ఆకర్షణీయంగా ఉన్నాడు.. అంటూ ఓ ట్వీట్ చేసిన వర్మ.. గుజరాత్ లో అతి పెద్ద స్టాచ్యూను మోదీ స్థాపిస్తే.. దానికన్నా 2.0 పెద్దదైన కేసీఆర్ స్టాచ్యూను తెలంగాణ స్థాపిస్తుంది అంటూ మరో ట్వీట్ వదిలాడు. ఇక… ఈ ట్వీట్లపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news