షాకింగ్: కరోనా టెస్ట్ కేవలం వంద రూపాయలే

-

ప్రైవేటు ప్రయోగశాలలు నిర్వహించే కరోనా టెస్ట్ ల విషయంలో ఓడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కోసం ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో గరిష్ట ధరను రూ .100గా నిర్ణయించింది. జీఎస్టీ కూడా అందులోనే అని స్పష్టం చేసింది. డిసెంబర్ 21 న ఒడిశా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని ఖర్చులను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

“రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కోసం పరీక్షా ప్రోటోకాల్‌ లకు సంబంధించి ఐసిఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి భువనేశ్వర్‌ లోని ఆర్‌ఎంఆర్‌సి పర్యవేక్షణలో ప్రైవేట్ లాబొరేటరీస్ ఈ పరీక్షలను నిర్వహిస్తాయని” ప్రకటన చేసింది. ఒడిశాలో డిసెంబర్ 20 న కొత్తగా 363 కోవిడ్ -19 కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి, 338 మంది రోగులు కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా పరిక్షల విషయంలో ఆందోళన ఉంది. ప్రభుత్వాలు చెప్పినా సరే చాలా మంది మూడు నుంచి 4 వేల వరకు ప్రజల వద్ద వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక దేశంలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. జూన్ తర్వాత 20 వేల లోపే కరోనా కేసులు మన దేశంలో నమోదు అయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తర్వాత ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news