మ‌న దేశంలో అత్యల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న ప్రాంతాలివే..!

-

వేస‌విలో స‌హ‌జంగానే దేశంలో అనేక చోట్ల అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుంటాయి. అయితే ఈ విష‌యం వేస‌వికే ప‌రిమితం కాలేదు. చ‌లికాలంలోనూ ప‌లు చోట్ల అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు రికార్డ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ఈ సారి గ‌తంలో క‌న్నా చ‌లి మ‌రింత పెరిగింది. ఇక మ‌న దేశంలో ప్ర‌స్తుతం అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న ప్రాంతాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

top 10 places in india recording lowest temperatures in this season

కేంద్ర పాలిత ప్రాంతం ల‌డ‌ఖ్‌లోని లెహ్ ప్రాంతంలో -13 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుండ‌గా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కైలాంగ్ అనే టౌన్‌లో ప్ర‌స్తుతం -7.7 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ‌త న‌మోదు అవుతోంది. అలాగే జ‌మ్మూ కాశ్మీర్‌లోని అనంత నాగ్ జిల్లాలో ఉన్న ప‌హ‌ల్‌గ‌మ్ అనే ప్రాంతంలో -6.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ‌త న‌మోద‌వుతోంది.

జ‌మ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో – 6 డిగ్రీలు, శ్రీ‌న‌గ‌ర్‌లో -5 డిగ్రీలు, కుప‌వ‌ర‌లో -4.5 డిగ్రీలు, కొకెర్‌నాగ్‌లో -4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు అవుతున్నాయి. అలాగే జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న అనంత‌నాగ్ జిల్లా కాజిగుండ్‌లో -4 డిగ్రీలు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని స‌ట్లెజ్ రివ‌ర్ వ్యాలీలో ఉన్న క‌ల్ప అనే ప్రాంతంలో -0.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఇక చివ‌రిగా జ‌మ్మూ కాశ్మీర్‌లోని కాజిగుండ్‌కు 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బ‌నిహ‌ల్ అనే ప్రాంతంలో -0.4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోద‌వుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లోనూ ప్ర‌స్తుతం 3 డిగ్రీల క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో రానున్న వేస‌వి కూడా మండిపోతుంద‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news