చంద్రబాబు సొంత జిల్లాలో నేతల పనితీరు పై వైసీపీ లెక్కలు

-

పంచాయతీ ఎన్నికలుఅధికార పార్టీ నేతలకు సవాల్‌గా మారాయి. తమ పదవులు కాపాడుకోవాలన్నా.. కొత్త పదవులు పొందాలన్నా.. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలన్నా.. ఈ ఎన్నికలే ప్రాతిపదిక. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా అధికార పార్టీ హవా కొనసాగించింది. అయితే జిల్లాలో అధికార పార్టీ నేతల పనితీరు పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెమటలు పట్టించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాల వరకు.. వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు మామూలుగా లేవని టాక్. ప్రతిపక్ష పార్టీలను నిలువరిచడం ఒక ఎత్తు అయితే.. సొంత పార్టీలో రెబల్స్‌ను బుజ్జగించడం మరో సమస్య. వీటన్నింటినీ ఎదుర్కొని తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకున్నారు వైసీపీ నేతలు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్యే రోజా.. తమ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కేలా చూసుకున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే చిత్తూరు జిల్లాలో టాప్ ప్లేస్. జిల్లా వైసీపీకి ఆయనే పెద్ద దిక్కు. అలాంటి ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరులో తన మార్క్ చూపించారు. ఎవరూ ఊహించని విధంగా మొత్తం 95 వరకు ఉన్న పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుని ప్రత్యర్ధులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. వెయ్యికిపైగా ఉన్న వార్డులను సైతం ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. దీంతో ఎప్పటిలానే పెద్దిరెడ్డి.. తన మార్క్ చూపించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని అంటోంది కేడర్. ఇక రానున్న పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో సైతం.. అన్ని వార్డులు ఏకగ్రీవం అయినట్లు సమాచారం.

ఇక డిప్యూటీ సిఎం నారాయణ స్వామి.. తన నియోజక వర్గంలో 137 పంచాయతీలుంటే…120 చోట్ల వైసీపీ మద్దతుదారుల్ని గెలిపించుకున్నారు. అయితే జిల్లాలో ఏ నేతకూ ఎదురుకాని రెబల్స్ సమస్యను ఆయన ఎదుర్కొన్నారని తెలుస్తోంది. ముందు నుంచీ గ్రూపులతో సతమతమవుతన్న నారాయణ స్వామీ.. పంచాయతీ ఎన్నికల్లో ఇదే ప్రాబ్లమ్‌ ఫేస్‌ చేశారు. అయితే ఈ రెబల్స్‌ సమస్యను ఆయన సక్సెస్‌ఫుల్‌గా అధిగమించారు. ఎలాగోలా పంచాయతీ ఎన్నికల్లో పాస్‌ మార్కులు సాధించిన ఆయన..తెగ సంతోషంగా ఉన్నారట. ఇక తన పదవికి ఢోకా లేదని తాను సేఫ్ అని అనుకుంటున్నారట.

ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా సైతం పంచాయతీ ఎన్నికలలో సక్సెస్‌ అయ్యారు. నగరి నియోజకవర్గంలోని 94 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ గెలిచింది. దీంతో ఎమ్మెల్యే రోజా ఇంట్లో సంబరాలు జరిగాయి. అయితే ఎన్నికలలో తన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి రోడ్డెక్కి చెమటోడ్చారు రోజా. అదే టిడిపి ఇన్ ఛార్జ్‌ గాలి భాను ప్రకాష్ మాత్రం.. ప్రచారం చేయకుండానే 20వరకు సీట్లు గెలిపించుకోవడం.. సొంత పార్టీ కేడర్‌కు మింగుడు పడని అంశంగా మారిందట. దీంతో నగరిలో గ్రామ స్ధాయిలో టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలంటోంది వైసీపీ కేడర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news