మొటిమలు తగ్గి చర్మం నిగ నిగ మెరవడానికి కావాల్సిన ఇంటి చిట్కాలు..

-

చర్మ సమస్యల్లో మొటిమలు చాలా సాధారణమైన సమస్య. మొటిమలు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటగా మన జీవన విధానంలో మార్పులు. మారుతున్న కాలంలో మన ఆహారపు అలవాట్లు మారడం, తీసుకునే ఆహారాల్లో పోషకాలు తగ్గడం, చర్మ సంరక్షణకి సంబంధించిన ఆహారాలని తీసుకోకపోవడం, మేకప్ సాధనాలని విరివిగా వాడడం కూడా మొటిమలు రావడానికి కారణం అవుతుందిఉ. మీ చర్మ రకానికి తగినవి కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది వాడడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.

అందుకే మేకప్ సాధనాలని వాడే ముందు మీ చర్మ రకం ఏదో తెలుసుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ప్రత్యేకమైన సాధనాలు ఉంటాయి. వాటిని మాత్రమే వాడితే చర్మం సురక్షితంగా ఉంటుంది. అదంతా పక్కన పెడితే ప్రస్తుతం మొటిమలు తగ్గించుకోవడానికి అద్భుతమైన ఇంటి చిట్కా ఇక్కడ ఉంది. మొటిమలు ఒక పట్టాన పోవు. ఎన్ని క్రీములు వాడినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఐతే ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా వీటిని ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం.

సీ సాల్ట్.. అవును సముద్రపు ఉప్పు ద్వారా మొటిమలని తగ్గించుకోవచ్చు. దీనిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి చర్మానికి మెరిసే గుణాన్ని అందిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ సీ సాల్ట్ ని తీసుకుని, దానికి కొంత పరిమాణంలో తేనె కలుపుకుని, ఆ తర్వాత కొంత నిమ్మరసాన్ని కలపాలి. ఈ మూడీంటినీ బాగా కలిపి ఒక మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దుకోవాలి. మొటిమలు ఉన్న స్థానంలో బాగా మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మ సమస్యలైన మొటిమలు మొదలగునవన్నీ పూర్తిగా తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news