జనసేన, బీజేపీ అభ్యర్ధులకు సపోర్ట్ చేస్తా.. చింతమనేని సంచలనం !

-

తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఏలూరు 23వ డివిజన్ లో టీడీపీ తరుపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి విత్ డ్రా చేసుకోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. అలా విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ల డివిజన్ లలో జనసేన, బిజెపి పార్టీ అభ్యర్థులు ఉంటే వారి తరపున నేను ప్రచారంలో పాల్గొంటానని అన్నారు.

Chandrababu serious on MLA Chintamaneni Prabhakar

పార్టీని అమ్ముకున్న వారికి  భవిష్యత్తు ఉండదు అని, నమ్ముకున్న వారికి నేను అండగా ఉంటా అని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. చింతమనేని కామెంట్స్ తో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వేడెక్కినట్టే చెప్పాలి. ఇక జిల్లాలో ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు విశ్వ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Latest news