ఆంధ్రలో ‘ఏబీసీడీ’ పాలసీ

-

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఏబీసీడీ’( ఎటాక్, బర్డెన్, కరప్షన్, డిస్ట్రక్షన్‌) పాలసీ ప్రవేశపెట్టిందని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీలు, దాడులు, అవినీతి పెరుగుతుందని ఇదే ఆ పార్టీ విధానమని బాబు విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలో భాగంగా గాజువాకలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నేను పదవులు కోరుకునే వ్యక్తిని కాదని.. రాష్ట్ర ప్రజల మనçస్సులో స్థానం çసంపాదించానని ఆదే తనకు చాలన్నారు. 2029 వరకు రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపాలనుకున్నా.. అందుకోసం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించానన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల బండారం బయట పెట్టాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రూ.50 వేల కోట్ల అప్పు..

అసలే ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని.. మద్యాన్ని అడ్డుపెట్టుకొని రూ. 5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇది చాలక వచ్చేనెల నుంచి ఇంటి పన్నులు సైతం పెంచబోతున్నారని పేర్కొన్నారు. షిప్‌యార్డ్‌ సిక్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నానని, ఎక్కడ చూసినా వసూళ్ల పర్వం కొనసాగుతుందని విమర్శించారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని దీంతో రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. విశాఖలో బెదిరించి భూములు లాక్కుంటున్నారని.. వైఎస్సార్‌సీపీ గెలిస్తే మీ ఇళ్లను సైతం గుంచుకుంటారని చంద్రబాబు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news