విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల్లో తీసుకురావొచ్చు: సీఎం జగన్

-

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విశాఖ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, ప్రైవేటీకరణ చేయకుండా.. కొంచెం అండగా నిలిస్తే కచ్చితంగా లాభాల బాటలో విశాఖ ఉక్కు కర్మాగారం నిలుస్తుందన్నారు. అయితే ఈ కర్మాగారానికి ఎలా లాభాలు వస్తాయో ఇప్పటికే కేంద్రానికి వివరించానని ఆయన పేర్కొన్నారు. స్వయంగా వివరించేందుకు అఖిలపక్ష నేతలు, కార్మిక నాయకులతో కలిసి వస్తానని, అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.

 

సీఎం జగన్
సీఎం జగన్

 

మంగళవారం (ఫిబ్రవరి 6న) రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు.. అలాగే ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని కోరానన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రికీ తెలియజేశానన్నారు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో 100 శాతం వాటాలు విక్రయించేస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రజల్లో నిరాశ మొదలైంది. ఆర్ఐఎన్ఎల్ ఆధీనంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రత్యేక సంస్థగా నిలుస్తోందని, నవరత్న సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. దాదాపు 20వేల మంది ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని, దీర్ఘకాలిక పోరాటం చేస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సొంతం చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు.

 

ఇలా పని చేస్తే లాభాల్లో విశాఖ ఉక్కు..

విశాఖ ఉక్కు కర్మాగారం 19,700 ఎకారాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ. లక్షల కోట్లకు పైమాటే. ఇటీవలే ఆర్ఐఎన్ఎల్ ఈ సంస్థను ఆధునికీకరించడంతో ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఏడాదికి 6.3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. ప్రతి నెల రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇలానే కొనసాగితే మరో రెండేళ్లలో పరిస్థితి సర్దుమణుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news