ప్రేమంటే ఇదేనేమో : భార్య కోసం పదేళ్ళుగా వెతుకుతూనే ఉన్నాడు..

-

ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులను ఆప్తులను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో వారిని కోల్పోయిన వారు వెంటనే మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడుతూ ఉంటారు. కానీ జపాన్ కు సంబంధించిన ఒక వ్యక్తి మాత్రం పదేళ్ల క్రితం సునామీ లో కొట్టుకుపోయిన తన భార్య కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. ఆసక్తికరంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జపాన్లో 2011 మార్చి 11న సునామీ విధ్వంసం సృష్టించింది. సునామీ వల్ల ఏర్పడిన వరదల్లో దాదాపు 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు 25 వేల మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ ఎవరికీ తెలియదు. నిబంధనల ప్రకారం చాలా రోజుల పాటు వేచి చూసిన ప్రభుత్వం వారు అందరూ మరణించినట్లుగా ప్రకటించి వారికి సర్టిఫికెట్ సైతం జారీ చేసింది. అయితే వీరిలో తాకామాత్సు అనే వ్యక్తి భార్య కూడా ఉంది. అయితే తన భార్య ఇంకా బతికే ఉందని నమ్మే అతను పదేళ్ల నుంచి సముద్రంలో వెతుకుతూనే ఉన్నారు. తన భార్య చనిపోలేదని చనిపోతే మృతదేహం దొరికింది కదా అని ఆయన వాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news