అమెరికాలో వృథాగా ప‌డి ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా కోవిడ్ డోసులు

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికీ అనేక దేశాలు ఓ వైపు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే మ‌రో వైపు అమెరికాలో మాత్రం కొన్ని కోట్ల కోవిడ్ డోసులు వృథాగా ప‌డి ఉన్నాయి. ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అక్క‌డ కొన్ని కోట్ల మేర నిల్వ ఉన్నాయి. వాటిని ఎప్పుడో అమెరికా స్వీక‌రించింది. అయిన‌ప్ప‌టికీ వాటిని ఇంకా ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డం లేదు.

millions of covid vaccine doses lying as wastage in usa

మ‌న దేశంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీల వ్యాక్సిన్ ను కోవిషీల్డ్ పేరిట పూణెలోని సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా విక్ర‌యిస్తోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే అదే వ్యాక్సిన్ కోసం అమెరికా గ‌తేడాది మేలోనే ఆస్ట్రాజెనెకా సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 300 మిలియ‌న్ల డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఆస్ట్రాజెనెకా అంగీకారం తెలిపింది. అందులో భాగంగానే ఇప్ప‌టికే సుమారుగా 40 మిలియ‌న్ల మేర కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అక్క‌డి ఓహియోతోపాటు ప‌లు ఇత‌ర ప్రాంతాల్లో గోడౌన్ల‌లో భారీ ఎత్తున నిల్వ చేశారు. అయితే అక్క‌డ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటా ఇంకా విడుద‌ల కాలేదు. అందువ‌ల్ల వ్యాక్సిన్‌కు ఇంకా అనుమ‌తి ల‌భించ‌లేదు. దీంతో వ్యాక్సిన్ల‌ను తెప్పించుకున్నా వాటిని వాడ‌కుండా నిల్వ చేస్తున్నారు.

అయితే అమెరికాలో ఇప్ప‌టికే ఫైజ‌ర్ వంటి ఇత‌ర కంపెనీల‌కు చెందిన వ్యాక్సిన్ల‌కు అనుమ‌తిచ్చారు. కానీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు మాత్రం ఇంకా అనుమ‌తి ల‌భించ‌లేదు. దీంతో కోట్లాది వ్యాక్సిన్ డోసులు గోడౌన్ల‌లో మ‌గ్గుతున్నాయి. ఇక డెన్మార్క్‌, నార్వే, ఐస్‌ల్యాండ్‌, రొమానియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకున్న‌వారిలో ర‌క్తం గ‌డ్డ క‌డుతుంద‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఆయా దేశాల్లో ఆ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌డం నిలిపివేశారు. దీనిపై అటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ద‌ర్యాప్తు జ‌రుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news