ఎముకలకు బలాన్ని చేకూర్చే కాల్షియం.. అది దొరికే ఆహారపదార్థాలు.. మీకోసమే..

-

శరీరాకి కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాల్సిందే. విటమిన్ డి, కాల్షియం కారణంగా ఎముకలు బలంగా తయారవుతాయి. అందుకే కాల్షియం గల ఆహార పదార్థాలను తీసుకోవాలి. శరీరంలో కాల్షియం తగ్గుతుంటే ఎముకలు పెళుసుగా మారి అనేక ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. అలా కాకుండా ఉండడానికి కావాల్సినంత కాల్షియం శరీరానికి అందాలి. మనం తీసుకునే ఆహారాల్లో కాల్షియం దొరికే పదార్థాలేమిటో తెలుసుకుందాం.

జున్ను

జున్నులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరం. ఐతే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మరింతగా అందడానికి పలుచని పాలతో చేసిన జున్నుని ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.

పాలు

రోజూ ఒక గ్లాసు పాలు శరీరానికి మంచి చేస్తాయి. చిన్నపిల్లలు ఉదయం, సాయంత్రం పాఅలు తాగితే ఇంకా బాగుంటుంది. చిన్నప్పటి నుండి పాలని ఆహారంగా అందించడం వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

గుడ్లు

విటమిన్ డి అందించే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తినడానికి సరైన ఆహారం. శరీరానికి కావాల్సిన ఇంధనాన్ని ఇవ్వడంలో గుడ్లు బాగా సహకరిస్తాయి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో గుడ్లని భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్రోకోలీ

ఆకుకూరల్లో ఒకటైన బ్రోకోలీ పోషకాలకు స్టోరేజీ వంటిది. విటమిన్ సి ఎక్కువగా ఉండడంతో పాటు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని పొషకాలు ఇందులో ఉన్నాయి.

సాల్మన్ చేప

విటమిన్ డి అధికంగా ఉండే ఆహారపదార్థాలలో సాల్మన్ చేప ప్రధానమైనది. కాల్షియం తక్కువగా ఉన్నవారు సాల్మన్ చేపని తింటే కాల్షియం స్థాయి బాగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news