చిన్న మొత్తాలే పెద్ద మార్పుకి కారణాలు.. ఆర్థిక అవగాహనలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..

-

డబ్బెలా సంపాదించాలనే విషయమై ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? ఏదైనా కొత్త ఐడియా వచ్చి ఒకేసారి డబ్బు పడిపోవాలని ఊహిస్తున్నారా? ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎక్కువ పనులు చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి పెద్ద ఉద్యోగం ఉండాలనో, మీ జీవితంలో గొప్ప మార్పు రావడానికి ఇంకేదో అద్భుతమో జరగాలను అనుకోవద్దు. నిజానికి మీరు పట్టించుకోని చాలా చిన్న విషయాలే పెద్ద మార్పుకి కారణం అవుతాయి. అవును, చిన్న చిన్న విషయాలో మీ నిర్లక్ష్యం మీలో గొప్ప మార్పుని అడ్డుకుంటుందని తెలుసుకోండి.

కొన్ని విషయాల్లో అనవసర ఖర్చులని తగ్గించి ఆ డబ్బుని పెట్టుబడి దారుల్లోకి మళ్ళించవచ్చు.

ముందుగా, అసలు అవసరం లేని వాటిని కొనడం ఆపేయండి. ఇది లేకపోతే నడవదు అనుకున్న వాటినే కొనండి. ఈ మహమ్మారి సమయంలో ఇంకా వాటి జోలికి అస్సలు పోవద్దు.

ఇంట్లోకి వస్తువులు కొందామని బయటకు వెళ్తే లిస్ట్ రాసుకుని వెళ్ళి అందులో ఉన్న వాటినే కొనండి. లిస్టులో రాయనిది కొనవద్దు. అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నాసరే.

చిన్న చిన్న మొత్తాలకి ఆన్లైన్ పేమెంట్లు చేయవద్దు. నెల తిరిగే సరికి అవే పెద్ద మొత్తంలో ఉండవచ్చు.

నెల ప్రారంభంలోనే ఆ నెలలో ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక ప్లాన్ తయారు చేసుకోండి. దానివల్ల మీకూ ఓ ఐడియా వస్తుంది.

వారంలో ఒక రోజు డబ్బులు ఖర్చు పెట్టకూడదన్న నియమం పెట్టుకోండి. మరీ అవసరమైతే తప్ప జేబులోంచి డబ్బులు తీయవద్దు.

బట్టలు, షూస్, గాడ్జెట్స్ పై ఎక్కువ ఖర్చు పెట్టవద్దు. బ్రాండెడ్ అని చెప్తూ అనవసరంగా వేలకి వేలు పోగొట్టుకోవద్దు. మీకు కలిసి వచ్చే రేటులో మీకు నచ్చే బట్టలు దొరికే అవకాశమూ ఉంది.

ఇలా చిన్న చిన్న వాటిమీద జాగ్రత్త పడితే పెద్దమొత్తంలో పొదుపు చేయవచ్చు. రూపాయి సంపాదించడం కన్నా రూపాయి పొదుపు చేయడం గొప్ప అని తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news