జ‌గ‌న్ పోస్టుల‌తో ద‌ద్ద‌రిల్లిన సోష‌ల్ మీడియా.. చ‌రిత్ర‌లో ఈ రోజు అలాంటిది మ‌రి!

-

మే 23 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ చ‌రిత్ర అని చెప్పాలి. ఎందుకంటే స‌రిగ్గా రెండేల్ల క్రితం ఈ రోజే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ ఫ‌లితాల్లో రాష్ట్రాన్ని ఫ్యాను గాలి ఊపేసింది. ఆ జిల్లా, ఈ ప్రాంతం అనే తేడా లేదు. మొత్తం వైసీపీ సునామీ క‌మ్మేసింది. ఇదే రోజు అటు టీడీపీని నిలువునా వ‌ణికించింది. ఆ పార్టీ చ‌రిత్ర‌లో ఎర‌గ‌ని ఘోర ఓట‌మిని చ‌విచూసింది.

175 అసెంబ్లీ స్థానాలుంటే ఏకంగా 151సీట్లు, 22 ఎంపీ స్థానాలు గెలుచుకుని ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం లిఖించారు జ‌గ‌న్‌. రాష్ట్ర‌మంతా జ‌గ‌నే కావాల‌ని గ‌ట్టిగా కోరుకున్నారు. దీంతో ఆయ‌న పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది.

అయితే ఈ రోజుకి ఆ ఫ‌లితాలు వ‌చ్చి స‌రిగ్గా రెండేళ్లు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ టాప్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతున్నారు. ల‌క్ష‌లాది మంది వైసీపీ అభిమానులు జై జ‌గ‌న్ అనే కామెంట్లు పెడుతున్నారు. ఏ సోష‌ల్ మీడియా యాప్ చూసినా జ‌గ‌న్ నినాద‌మే వినిపిస్తోంది. దీంతో మ‌రోసారి జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో సోష‌ల్ మీడియా ద‌ద్ద‌రిల్లింది.

Read more RELATED
Recommended to you

Latest news