నెల్లూరులో ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు విషయంలో ఇప్పుడు కాస్త ఉత్కంట నెలకొంది. ఈ మందు విషయంలో పరిశోధనలు జరుగుతాయా లేదా అనే దానిపై అసలు ఏమీ అర్ధం కావడం లేదు. ఇక ఆనందయ్య మందుపై ఐసిఎంఆర్ పరిశీలన ఉండక పోవచ్చు అని అధికారులు అంటున్నారు. ఐసీఎంఆర్ కి సంబంధం లేకుండానే మందు తయారీ, పంపిణీ కి కసరత్తు చేస్తున్నారు.
మందు హానికరం కాదని ఆయుష్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఐసిఎంఆర్ పరిశీలించినా ఆమోదం ఉండక పోవచ్చు అనే వాదన ఒకటి వినపడుతుంది. క్లీనికల్ ట్రయిల్స్, ఇతర పరీక్షలు లేకుండా ఐసిఎంఆర్ ఆమోదం లభించదు అని అధికారులు అంటున్నారు. దీనితో ఐసిఎంఆర్ తో సంబంధం లేకుండానే పంపిణీ కి రాష్ట్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రకటన కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.