యష్ తుఫాన్ ఇప్పుడు ఎక్కడ…? దాని స్థితి ఏంటీ…?

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారింది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి యాష్ గా నామకరణం చేసిన భారత వాతావరణ శాఖ.. ఇది పారాదీప్ కు 540 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారనుంది అని పేర్కొంది.

ఈనెల 26వ తేదీన సాయంత్రం బాలాసోర్, సాగర్ దీవుల మధ్యలో తీరం దాటనుంది అని వారు వెల్లడించారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అని అధికారులు పేర్కొన్నారు. అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతుంది అని వెల్లడించారు. ఏపీ, తెలంగాణా ఇప్పుడు అలెర్ట్ అయ్యాయి.