పర్యాటకానికి తలుపులు తెరిచిన ఇజ్రాయెల్.. చిన్న సమూహాలకు అనుమతి..

-

కరోనా కారణంగా బాగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న దేశాలు తీవ్ర ఇబ్బందులకి గురయ్యాయి. బయటకి వెళ్ళడమే ప్రమాదం కాబట్టి ఈ ఇబ్బంది ఇంకా కొనసాగుతుంది. ఐతే కరోనా వ్యాక్సిన్ వచ్చాక పరిస్థితి కొద్దిగా నయమైంది. చాలా దేశాలు పర్యాటకానికి పచ్చజెండా ఊపుతున్నారు. ఇప్పటికే యూరప్ లోని కొన్ని దేశాలు పర్యాటకాన్ని అనుమతిస్తున్నాయి. ఆ జాబితాలోకి ఇజ్రాయెల్ కూడా చేరుకుంది.

మాక్ ఫ్రీ దేశంగా మారిన ఇజ్రాయెల్ పర్యాటకానికి తలుపులు తెరిచింది. ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం చిన్న చిన్న సమూహాలకే అనుమతులు ఇచ్చిన ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ, మరికొద్ది రోజుల్లో పెద్ద పెద్ద సమూహాలకు అనుమతి ఇవ్వనుంది. మొదటి విడతగా ఈ నెల చివరి వరకు పర్యాటకం మొదలు కానుంది. 2019లో ఇజ్రాయెల్ కి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. లెక్కల ప్రకారం 4.55 మిలియన్ల సందర్శకులు ఇజ్రాయెల్ కు వచ్చారు. దాంతో ఆదాయం 7.1బిలియన్ డాలర్లు వచ్చింది.

పర్యాటక మంత్రి ఒరిట్ ఫర్కాష్-హాకోహెన్ మాట్లాడుతూ పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని సేవలు కల్పిస్తున్నామని, మరికొద్ది రోజుల్లో పెద్ద సమూహాలకు అనుమతి లభిస్తుందని అన్నాడు. చిన్న సమూహాల వల్ల కోవిడ్ వ్యాప్తిని పరిశీలించడం, అదీగాక కొత్త కొత్త వేరియంట్ల తాకిడి ఎక్కువగా ఉండకుండా ఉంటుందని అన్నారు. ఐతే ఇజ్రాయెల్ పర్యాటకానికి వెళ్ళేవారు కరోనా టెస్టు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇజ్రాయెల్ జనాభాలో ఇప్పటివరకు 55శాతం మందికి వ్యాక్సిన్ వేసారు. కరోనా కేసులు కూడా బాగా తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Latest news