నాగబాబు కామెంట్స్ పై వర్మ స్పందన..!

-

మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణ మీద చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారాయి. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ను.. చిరంజీవిని టార్గెట్ చేస్తూ అన్న మాటలని అన్నిటిని సేకరించి వాటిపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాడు నాగబాబు.

ఇప్పటివరకు 5 కామెంట్స్ తో బాలకృష్ణని టార్గెట్ చేసిన నాగబాబు ఈరోజు సాయంత్రం కల్లా లాస్ట్ అండ్ ఫైనల్ కామెంట్ తో తన ఈ వీడియోల పరంపరని ఆపేస్తారట. నాగబాబు బాలకృష్ణ మీద చేస్తున్న ఈ కామెంట్స్ పై ఆర్జివి స్పందించడం విశేషం. కామెంట్స్ చేయడంలో నన్ను మించిపోయారనే నా బాధ ఒకవైపు.. తన బ్రదర్స్ ను సమర్ధించుకోవడంలో సూపర్ స్టార్ గా మారాడని ఆనందం ఒకవైపు. ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు నాగబాబు గారు మీకు హ్యాట్సాఫ్.. మీ బ్రదర్స్ ను మీరు ఎంత ప్రేమిస్తున్నారో మేమి అంతే ప్రేమిస్తున్నాము అంటూ వర్మ ట్వీట్ చేయడం నాగబాబు కామెంట్స్ కు మరింత బలాన్ని ఇచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news