పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పరీక్షల నిర్వహణపై నిన్న ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారని హెచ్చరించింది. అంతే కాదు.. పరీక్షల సందర్భంలో ఎవరైనా విద్యార్థులు మరణిస్తే ఒకొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా…!? పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ సలహాలు తీసుకోవచ్చని పేర్కొంది.
గ్రేడింగ్ విధానం ఉందని, పరీక్షల నిర్వహణ ఒక్కటే మార్గం కాదని…ఇతర పరిష్కార మార్గాలు కూడా ఉంటాయని వెల్లడించింది సుప్రీంకోర్టు. అన్ని కోణాల్లో పరిశీలించి పరీక్షలు నిర్వహించాలన్న జస్టిస్ మహేశ్వరి… పరీక్షల నిర్వహణలో భద్రత, రక్షణ ముఖ్యమైన అంశాలు అని పేర్కొన్నారు. పరీక్షల మధ్యలో “కరోనా” కేసులు పెరిగితే ఏం చేస్తారని అన్ని అంశాలు అఫిడవిట్ లో పేర్కొనాలని ఆదేశించింది.విద్యార్థులకు ప్రతిరోజు ముఖ్యమైనదే..రేపటి లోగా పరీక్షల నిర్వహణ విషయాలు కోర్టుకి తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.