అక్టోబ‌ర్‌లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ చేసేందుకు జ‌క్క‌న్న ప్లాన్‌!

-

మోస్ట్ వెయిటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న మూవీ ఆర్ ఆర్ ఆర్ . ఇప్ప‌టికే ఈ మూవీపై అంచ‌నాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు అంచ‌నాల‌ను అమాంతం డ‌బుల్ చేశాయ‌నే చెప్పాలి. అయితే ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి వ‌చ్చింది.

ఆర్ ఆర్ ఆర్

అన్ని సినిమాల్లాగే క‌రోనా వ‌ల్ల ఇది కూడా షూటింగ్ ఆగిపోయింది. దీంతో రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియ‌క ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇప్పుడు క‌రోనా కాస్త త‌గ్గ‌డంతో మేక‌ర్స్ షూటింగ్‌ని మొద‌లు పెట్టేశారు. ఈ జూలై నెలాఖ‌రు వ‌ర‌కు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను పూర్తి చేయ‌నున్నారు.

ఆ వెంట‌నే మిగిలిన పోస్టుప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి అక్టోబ‌ర్‌లో సినిమాని విడుద‌ల చేయాలని చూస్తున్నాడంట జ‌క్క‌న్న. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో స్పెష‌ల్ గా వేసిన సెట్‌లో మూవీకే హైలెట్ సీన్స్‌ను తెర‌కెక్కిస్తున్నాడంట రాజ‌మౌళి. ఇప్ప‌టికే ఇందులో రామ్‌చరణ్ అడుగుపెట్టాడు. ఇక బుధవారం నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదే సెట్ లో వీరిద్ద‌రి మ‌ధ్య ఓ సాంగ్‌ను కంపోజ్ చేయ‌నున్నాడంట జ‌క్క‌న్న‌. మ‌రి జ‌క్క‌న్న ప్లాన్ ఏ మేర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news