కోవిడ్-19 డెల్టా వేరియంట్ లో నాలుగు రకాలు..హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు…!

-

కరోనా మహమ్మారి కారణంగా మనం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాము. భారత దేశంలో వైద్య నిపుణులు కరోనా డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు త్వరగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్లలో కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు.

డెల్టా వేరియంట్

అయితే ఇక వేరియంట్ల గురించి చూస్తే…B.1.617.3, B.1.1.318 ఉన్నాయి, వీటిలో 14 వేరియంట్స్ ఉన్నాయి, లాంబ్డా (C.37) మరియు కప్పా (B.1.617.1). జూన్ 23 నాటి నుండి లాంబ్డా వేరియంట్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మరియు కప్ప వేరియంట్ డెల్టా లేదా డెల్టా ప్లస్ కంటే పెద్ద సమస్య కాదని గుర్తించారు.

డెల్టా ప్లస్ వేరియంట్ ని మహారాష్ట్రలో గుర్తించారు. అయితే ఈ మ్యుటేషన్ కారణంగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. డాక్టర్ విగ్నేష్ నాయుడు వై కన్సల్టెంట్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ హైదరాబాద్ ఈ వేరియంట్స్ మరింత ఎక్కువవుతాయని.. దీని కారణంగా మళ్ళీ అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.

ఇంతలో లాంబ్డా వేరియంట్‌ను ఇతర దేశాలకు వ్యాపించినప్పటి నుండి పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) స్టడీ చేస్తోంది.

ఇది ఇలా ఉంటే డెల్టా వేరియంట్‌లో 15-17 వేరియంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఇది మొదటిసారి నివేదించబడింది మరియు ఫిబ్రవరిలో మహారాష్ట్రలో 60 శాతానికి పైగా కేసులకు ఇది కారణం అనే చెప్పాలి. ఇది 80 దేశాలకు వ్యాపించిందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు.

B.1.617 జాతిలో మూడు రకాలు వున్నాయి. అవే.. B.1.617.1, B.1.617.2 మరియు B.1.617.3 – మరియు B.1.617.2 (డెల్టా వేరియంట్). వీటి వలన కరోనా మరెంత ఎక్కువయ్యింది. ఇది ఇలా ఉంటే B.1.617.2 ప్లస్ లేదా డెల్టా ప్లస్ వేరియంట్ ని భారత దేశంలో కొన్ని చోట్ల ఉన్నట్టు గుర్తించారు.

డెల్టా వేరియంట్ కేసుల్లో 25 శాతానికి పైగా ఉన్న 16 దేశాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఆ దేశాలు వివరాల లోకి వెళితే… ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్, కెన్యా, మయన్మార్, పెరూ, పోర్చుగల్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ SARS-CoV-2 వేరియంట్ల ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టాకు వ్యతిరేకంగా పని చేస్తాయి అని కూడా ఆయన చెప్పారు.

కరోనావైరస్ వ్యాధికి సంబంధించిన నాలుగు రకాలు ఉన్నాయి – ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా – డెల్టా ప్లస్ డెల్టా వేరియంట్. కోవిషీల్డ్ ఆల్ఫాతో కొద్దిగా 2.5 రెట్లు తగ్గిస్తుంది. డెల్టా వేరియంట్ కోసం, కోవాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుంది.

ఫైజర్ మరియు మోడెర్నాలో ఇది ఏడు రెట్లు తగ్గింపు చేస్తుంది. కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ SARS-CoV-2- ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా వేరియంట్స్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news