రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఒక వంతు అయితే.. అనూహ్యంగా రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వడం మరో వంతు అని చెప్పాలి. రేవంత్ revanth ను ప్రెసిడెంట్‌గా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో కొంత అలజడి మొదలైందనే చెప్పాలి.
అయితే రేవంత్ రెడ్డి టీఆర్ ఎస్‌కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటున్నాడు. కానీ టీఆర్ ఎస్‌ను గద్దె దించడం అనేది చాలా కష్టమని రేవంత్‌కు స్పష్టంగా తెలిసినా తన వంతు ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు.
ఇందుకోసం ప్రధానంగా రెండు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. టీఆర్ ఎస్‌పై వాటితోనే యుద్ధానికి రెడీ అవుతున్నట్టు టీ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదటగా నిరుద్యోగ యువతను ఏకం చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నాడు. దాని తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ నాయకులకు కలిసి వచ్చిన పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు. దాంతో పాటే బీసీలను కూడా తన వైపుకు మలుపుకునేందుకు ప్లాన్ వేసుకుంటున్నాడు.