న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తటస్థంగా ఉన్నాయి. కొంతకాలంగా ఆయిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం కూడా పెరిగాయి. అయితే తాజాగా వాహనదారులకు ఊరట కలిగింది. దేశంలో అత్యధికంగా జైపూర్‌లో పెట్రోల్ లీటర్ రూ. 107,67 కాగా డీజిల్ రూ. 98.51గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.20గా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.15గా ఉండగా డీజిల్ ధర రూ. 97.78గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, లడఖ్, పంజాబ్, తమిళనాడు, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు నాగాలాండ్, బిహార్, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటిన విషయం తెలిసిందే.
వివిధ నగరాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!