న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతూనే ఉంది. రెండు నెలలుగాపెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ పై అత్యధికంగా 37 పైసలు, డీజిల్‌పై 64 పైసలు వరకూ పెరిగింది.
దేశ రాజధానిలో ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ. 101,84గా ఉండగా డీజిల్ రూ. 87.97గా పెట్రోల్ బంకు వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 107,83 కాగా లీటర్ డీజిల్ రూ. 97,45గా ఉంది.
ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105,83 కాగా లీటర్ డీజిల్ రూ. 97.96గా అమ్మకాలు జరుగుతున్నాయి. అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.85, డీజిల్ రూ. 99.14గా ఉంది.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు: