ఈ సారి వాళ్ళు కేసీఆర్‌కు హ్యాండ్ ఇస్తారా?

-

ఈ సారి కేసీఆర్‌కు ఆంధ్రా ఓటర్లు హ్యాండ్ ఇస్తారా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా? అంటే నిదానంగా తెలంగాణలో మారుతున్న రాజకీయాలని బట్టి చూస్తే, నెక్స్ట్ ఆంధ్రా వచ్చి సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు టీఆర్ఎస్‌కు తక్కువ పడే అవకాశాలున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. మామూలుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న నియోజకవర్గాల పరిధిలో ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

cm-kcr
cm-kcr

2014లోనే వీరు టీఆర్ఎస్‌కు గట్టిగానే షాక్ ఇచ్చారు. ఈ జిల్లాలో పరిధిలో టీడీపీ-బీజేపీలు ఎక్కువగా సీట్లు గెలుచుకున్నాయి. అటు రాష్ట్రం విడదీశారనే కోపంతో కాంగ్రెస్‌ని కూడా ఆదరించలేదు. అయితే 2018 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ పరిస్తితి క్లోజ్ అయింది. అటు బీజేపీపై తెలుగు ప్రజలకు ఆగ్రహం ఉంది. అలాగే కాంగ్రెస్ పుంజుకోలేదు.

ఈ క్రమంలో ఆంధ్రా ఓటర్లు పెద్ద ఎత్తున కేసీఆర్‌కు మద్ధతు ఇచ్చారు. పైగా చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం కూడా టీఆర్ఎస్‌కు పెద్ద ప్లస్ అయింది. అందుకే ఆంధ్రా ఓటర్లు అప్పుడు టీఆర్ఎస్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన జి‌హెచ్‌ఎంసి ఎన్నికల్లో సైతం ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ సత్తా చాటింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్తితి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు దక్కడంతో రాజకీయాలు కాస్త మారాయి.

తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు, రేవంత్‌ని కూడా అభిమానిస్తారు. అయితే టీడీపీ పరిస్తితి బాగోకపోవడంతో, ఇప్పుడు వారు రేవంత్‌కు మద్ధతు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. అలా అని ఆంధ్రా ఓటర్లు బీజేపీని ఆదరించడం కష్టమని అంటున్నారు. ఏదేమైనా ఆంధ్రా ఓటర్లు ఈ సారి కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news