తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో మాఘమాసం ఒకటి అంటే ఆశ్చర్యం లేదు. చాలా సినిమాల్లో మాఘమాసంపై పాటలు, సంఘటనలు ఎన్నో చిత్రీకరించారు అంటే దాని విలువ మనకు అర్థమవుతుంది.
మాఘమాసాన్ని మహాదేవుడు శివునికి అత్యంత ఇష్టమైన మాసంగా శివభక్తులు భావిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 6 వరకు మాఘమాసం ఉంటుంది.
మాఘమాసంలో చేయాల్సిన విధులు, వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం..
– మాఘ స్నానాలు చాలా ప్రసిద్ధి. పవిత్ర నదుల్లో అంటే గంగా, యమునా, గోదావరి, కృష్టా, తుంగభద్ర వంటి నదులు, సముద్ర సాన్నాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
పండుగలు
– ఫిబ్రవరి 10 వసంత పంచమి (సరస్వతి పూజ, అక్షరాభాసాలకు ప్రత్యేకం)
– ఫిబ్రవరి 12 రథసప్తమి (సూర్య భగవానుని ఆరాధించే పవిత్రమైనరోజు)
– ఫిబ్రవరి 13 భీష్మాష్టమి (భీష్ముడు పరమపదించిన రోజు, ప్రతి ఒక్కరు తప్పక తర్పణాలను భీష్మునికి వదలాల్సిన రోజు), కుంభ సంక్రాంత్రి,
– ఫిబ్రవరి 16 జయ ఏకాదశి
– ఫిబ్రవరి 19 మాఘ పౌర్ణిమ
– మార్చి 4 మహా శివరాత్రి
నోట్: ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలలో మాఘమాస స్నానాలకు విశేషంగా చెప్తారు. అవకాశం ఉన్నవారు గంగానదిలో స్నానం ఆచరిస్తే పరమ పవిత్రంగా శాస్ర్తాలు అభివర్ణిస్తున్నాయి.
– కేశవ