రైతు సంఘాలు ఇచ్చిన దేశబంద్ కు మద్దతుగా తెలంగాణలో విపక్షాలు కదంతొక్కుతున్నాయి. నిన్నటి నుంచే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు బంద్ కు సంబంధించి కార్యచరణను సిద్ధంచేశాయి. అందుకు అనుగుణంగానే నేడు ఆందోెళనలను జరుపుతున్నాయి. అయితే రైతులకు మద్దతుగా టీెఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం కూడా బంద్ కు మద్దతు ఇచ్చినా యాజమాన్యం నిర్ణయం మేరకు బస్సులను నడిపేందుకు సిద్ధం అయింది. అయతే ఈ తరుణంలోనే విపక్షాలు వేకువజాము నుంచి డిపోల ముందు ధర్నాలు, నిరసన దీక్షలకు చేపడుతోంది. దీంతో చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దూర ప్రాంతాలకు వెళ్లేవారు బంద్ మూలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయనే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాలకు వచ్చివెళ్లే బస్సులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భద్రతను పెంచింది. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ల వద్ధ పోలీస్ పహారాను పెంచింది. అయినప్పటికీ విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఉదయం పూట బస్సులు డిపోలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విపక్షాల ఆందోళన.. డిపోలకే పరిమితమవుతున్న బస్సులు
-