హుజూరాబాద్ ఉపఎన్నిక పోరులో మాటల యుద్ధం ముదురుతుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ప్రత్యర్ధులపై మాటల దాడికి దిగుతున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్-టిఆర్‌ఎస్‌ల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఈటలని టార్గెట్ చేసి టిఆర్‌ఎస్ శ్రేణులు దూకుడుగా ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నిక గెలుపు బాధ్యతని భుజాన వేసుకున్న మంత్రి హరీష్ రావు….రెండో ఆలోచన లేకుండా ఈటలని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు.
ఈటల కూడా ఎక్కడకక్కడ హరీష్‌కు, టిఆర్‌ఎస్‌కు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే….మంత్రి హరీష్…ఈటలని డైరక్ట్‌గా ఎటాక్ చేయడం వల్ల ఉపయోగం లేదని తెలిసి, బిజేపిని టార్గెట్ చేసి ఈటలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అసలు హుజూరాబాద్‌లో గమనిస్తే బిజేపి హైలైట్ కావడం లేదు…ప్రజలంతా ఈటలనే చూస్తున్నారు. అసలు పార్టీ పరంగా ప్రజలు చూడటం లేదు…మెజారిటీ ప్రజలు ఈటల పరంగా చూసి ఓటు వేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.
కానీ హరీష్ మాత్రం ఈటలని సైడ్ చేసి…పార్టీని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతసేపు బిజేపి అలా చేసింది…ఇలా చేసింది అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా బిజేపి తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ఈటల అందులో చేరారని ప్రశ్నించిన హరీష్…గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి పేదలపై భారం పెట్టిందని అన్నారు. అలాగే టిఆర్‌ఎస్‌ని గెలిపించుకుంటే సంక్షేమం వస్తుందని, బిజేపిని గెలిపిస్తే ధరలు పెరుగుతాయని అన్నారు.
అంటే ఇక్కడ హరీష్…బిజేపినే హైలైట్ చేయాలని చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి చేసే కార్యక్రమాలని హుజూరాబాద్ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా కారణమే. ఆ విషయం మరిచిపోయి బిజేపిని హరీష్ టార్గెట్ చేస్తున్నారు. అంటే బిజేపిపై నెగిటివ్‌తో ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారని అనుకుంటున్నట్లున్నారు. కానీ హరీష్ ఎంత ట్రై చేసిన ఉపయోగం లేదు. హుజూరాబాద్ ప్రజలకు ఈటలపై బాగా క్లారిటీ ఉన్నట్లు ఉంది.